విజయనగరం జిల్లా చల్లపల్లిలో పురిటిగడ్డ ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ అధినేత డాక్టర్ వేములపల్లి సురేష్ అధికారులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి ప్రజలను ఆందోళన పరుస్తున్న తరుణంలో విధి నిర్వహణకు వెనుకడుగు వేయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, జర్నలిస్టులకు... డా.వేములపల్లి సురేష్ తనవంతు సహకారంగా వీటిని అందించారు. రూ.40వేల విలువైన కిట్లను తహసీల్దార్ కె.స్వర్ణమేరి వీటిని అధికారులకు పంపిణీ చేశారు.
ఇవీ చూడండి:స్పందనలో తెదేపా నేతల అర్జీ.. వైకాపా పాలనపై ఫిర్యాదు