విజయనగరం జిల్లా బొబ్బిలి సంస్థానం ఉన్నత పాఠశాలలో చదివిన 1977-78 బ్యాచ్ పూర్వ విద్యార్థులు బొబ్బిలి సామాజిక ఆస్పత్రికి నీటిశుద్ధి ప్లాంట్ను అందజేశారు. సుమారు లక్షన్నర రూపాయల విలువ చేసే ఈ ప్లాంట్ను రోగులకు ఉపయోగపడే విధంగా అమర్చారు. నిత్యం వందలాది మంది ఆసుపత్రికి వస్తుంటారని, వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు పూర్వ విద్యార్థులు వెల్లడించారు.
ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు నీటి శుద్ధి ప్లాంట్ను ప్రారంభించారు. నలుగురికీ ఉపయోగపడే విధంగా ప్లాంట్ ఏర్పాటుచేయడంపై పూర్వవిద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: