![fishermen reached their home town vizainagaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7024214_485_7024214_1588394639722.png)
లాక్డౌన్ నేపథ్యంలో గుజరాత్ వేరావల్‌లో చిక్కుకున్న విజయనగరం జిల్లాకు చెందిన మత్స్యకారులు శనివారం తెల్లవారుజామున క్షేమంగా జిల్లాకు చేరుకున్నారు. వీరిని రాజాపులొవ కూడలిలో ఎస్పీ రాజకుమారి, డీఆర్ఓ వెంకటరావుతో పాటు మత్స్యశాఖ ఏడీ సుమలత సాదరంగా ఆహ్వానించారు. ఎనిమిది బస్సుల్లో జిల్లాకు చెందిన 119 మంది మత్స్యకారులు వచ్చినట్లు ఎస్పీ రాజకుమారి తెలిపారు. 711 మందిలో తొలివిడతగా వీరు వచ్చినట్లు మరో 5 గంటల్లో మిగిలిన వారు ఏర్పాటు చేసిన వాహనాల్లో రానున్నట్లు తెలిపారు. వీరిని పూసపాటిరేగ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు పంపిస్తామని, ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె వివరించారు.
ఇవీ చూడండి...