విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఐసీయూ వార్డులో పొగ కమ్ముకుంది. వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగులను సాధారణ గదికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. ఊహించని ఈ ఘటనతో రోగులు, వారి సహాయకులు భయభ్రాంతులకు గురయ్యారు.
ఇదీచదవండి.