విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని రైతులు ఆందోళన చేశారు. ధాన్యం కొనుగోలు చేసి నగదు ఇవ్వలేదని సాలూరు పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. స్పందించిన జేసీ కృష్ణకిషోర్... రైతుల నుంచి సేకరించిన ధాన్యం గోదాముల్లో ఎంత ఉంది, ఎంత వరకు చెల్లింపులు చేయాలనే వివరాలు సేకరించారు. రైతులకు డబ్బులు అందించేందుకు, మిగిలిన ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చూడండి రేపటి నుంచి బస్సు సర్వీసులు ప్రారంభం: ఆర్టీసీ ఎండీ