ETV Bharat / state

అన్నదాతల అగచాట్లు... మూడు నెలలైనా రైతుల వద్దే ధాన్యం! - విజయనగరం జిల్లా వార్తలు

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేక అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. పంట చేతికొచ్చి మూడు నెలలైనా... ధాన్యం నిల్వలు రైతు గడప దాటని పరిస్థితి నెలకొంది. ఓ వైపు మిల్లర్ల కొర్రీలు... మరోవైపు నామమాత్రంగా సాగుతున్న కొనుగోలు కేంద్రాల నిర్వహణ. వెరసి... విజయనగరం జిల్లాలో పండించిన పంటలో 40 శాతం కూడా కొనుగోలు చేయని దుస్థితి ఏర్పడటంతో రైతన్నలు కన్నీరు పెడుతున్నారు.

అన్నదాతల అగచాట్లు
అన్నదాతల అగచాట్లు
author img

By

Published : Jun 24, 2021, 5:29 PM IST

అన్నదాతల అగచాట్లు

విజయనగరం జిల్లాలో రబీ వరి సాధారణ విస్తీర్ణం 4వేల 418 హెక్టార్లు కాగా.... ఈ ఏడాది 7వేల 948 హెక్టార్లలో సాగైంది. ఫలితంగా 40వేల 536 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. పంటను సేకరించేందుకు జిల్లా యంత్రాంగం 41 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. పంట చేతికొచ్చి మూడు నెలలు కావస్తున్నా.. కేవలం 20వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. అనేక నిబంధనలతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంట తీసుకునేందుకు నిర్వాహకులు నిరాకరిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు.

పేదలకు నాణ్యమైన బియ్యం అందించేందుకు స్టార్టప్‌ యంత్రాలు సమకూర్చుకోవాలని ప్రభుత్వం మిల్లర్లకు సూచించింది. దీనివల్ల నూకశాతం తక్కువగా ఉంటుందని తెలిపింది. అయితే స్టార్టప్ యంత్రాలు భారం భరించలేమంటూ మిల్లర్లు ముందుకు రాకపోవడంతో.... ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. అధికారులు పలుమార్లు మిల్లర్లతో చర్చలు జరపగా.. విజయనగరం డివిజన్‌లో కొత్త యంత్రాలు ఏర్పాటు చేసుకున్నారు.

కానీ.. పార్వతీపురంలో డివిజన్‌లో ఇంకా పాత యంత్రాలనే వినియోగిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ధాన్యం కొనుగోళ్లు మందగించాయి. నెలల తరబడి ఎదురుచూడలేక రైతులు ప్రైవేట్ వ్యక్తులకు నష్టానికి ధాన్యం అమ్ముకుంటున్నారు. వాతావరణ పరిస్థితులు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. సేకరణకు నోచుకోని ధాన్యం.. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరుబయట, ఇళ్లు, పురుల్లోనూ ఉండిపోయింది. వర్షాకాలం రావడంతో ఏ క్షణం ఏ ఆపద ముంచుకొస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

రైతుల నుంచి ప్రతీ గింజనూ కొనుగోలు చేస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు పట్టించుకోవడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి పంటను కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

AP EXAMS: పరీక్షల సమయంలో మూడో వేవ్ వస్తే.. ఏం చేస్తారు?: సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.