విజయనగరం జిల్లా నెలిమర్ల నియోజకవర్గంలోని భోగాపురం, పూసపాటిరేగ మండల కేంద్రాల్లో రైతు భరోసా కేంద్రాలను ఎమ్మెల్యే అప్పలనాయుడు ప్రారంభించారు. నియోజకవర్గంలో 62 కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు వెన్నుదన్నుగా ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. ఈ కేంద్రాల ద్వారా భూసార పరీక్షలు, పశు సంరక్షణ,విత్తనాలు, ఎరువులు తదితర అవసరమైనవి అందుతాయని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: