విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మోదుగులపేట గ్రామానికి చెందిన కలిశెట్టి మల్లేశ్వరరావు అనే రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. రైతు కలిశెట్టి మల్లేశ్వరరావు తన పొలంలో మొక్కజొన్న పంటకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. మోటారు స్విచ్ ఆన్ చేయగా.. విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలో ఉన్న భార్య ఈశ్వరమ్మ భర్త చావును కళ్లారా చూసి కన్నీరుమున్నీరయింది. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఇవీ చదవండి