విజయనగరం జిల్లా పాచిపెంట గ్రామానికి చెందిన అనుపోజు రాము అనే బంగారు వ్యాపారిని బెదిరించి.. రెండు లక్షల రూపాయలు వసూలు చేసేందుకు ముగ్గురు నకిలీ మావోయిస్టులు ప్రయత్నించారు. నగదును పాచిపెంట మండలం రోడ్డ వలన గ్రామంలోని ఆంజనేయస్వామి గుడివద్ద పెట్టాలని ఫోను చేశారు. ఈ ఘటనపై.. సదరు వ్యాపారి పోలీసులకు సమాచారం అందించారు. విచారణ చేపట్టిన పోలీసులు.. పథకం ప్రకారం నగదును గుడి దగ్గర పెట్టారు. డబ్బు తీసుకోవడానికి వచ్చిన ముగ్గురు నిందితులు వేములు శ్రీనివాసరావు, నిమ్మకాయల ప్రసాద్‌రావు, వంతల సురేష్లను పోలీసులు పట్టుకున్నారు.
నిందితులలో ఒకరైన వేముల శ్రీనివాసరావు జ్యువెలరీ షాపు నడుపుతున్నాడు. సహవ్యాపారి లాభాలు చూసి... నగదు కోసం అతణ్ని బెదిరించాలని తన స్నేహితులతో కలిసి.. నకిలీ మావోయిస్టు నాటకం ఆడాడని పోలీసులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పాచిపెంట సీఐ సింహాద్రి నాయుడు తెలిపారు.
ఇదీ చదవండి: