ETV Bharat / state

Minister Botsa Comments on Amma Odi: 'విద్యార్థులు, తల్లిదండ్రులు కాకపోతే.. సినిమా యాక్టర్లు వస్తారా..' - అధికారులతో సమీక్ష

Minister Botsa Comments: 'అమ్మఒడి సభా కార్యక్రమాలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కాకపోతే సినిమా యాక్టర్లు వస్తారా... తల్లిదండ్రులు రావడం తప్పని నేను అనుకోవడం లేదు. ఈ విషయంపై కోర్టు సూచనలిస్తే పాటిస్తాం' అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, పంట నష్టంపై విజయనగరం జిల్లా అధికారులతో మంత్రి సమీక్షించారు.

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
author img

By

Published : Jul 28, 2023, 5:10 PM IST

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

Education minister Botsa Satyanarayana comments on Amma Odi: 'అమ్మఒడి సభా కార్యక్రమాలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కాకపోతే సినిమా యాక్టర్లు వస్తారా.. తల్లిదండ్రులు రావడం తప్పని నేను అనుకోవడం లేదు. ఈ విషయంపై కోర్టు సూచనలిస్తే పాటిస్తాం'అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, పంట నష్టంపై విజయనగరం జిల్లా అధికారులతో మంత్రి సమీక్షించారు. కలెక్టర్ కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ చేపట్టిన సమీక్షలో కలెక్టర్ నాగలక్ష్మితో పాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వర్షాల ప్రభావంతో పాటు నూతన వైద్య కళాశాల ప్రారంభోత్సవం, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శంకుస్థాపన కార్యక్రమాలపైనా మంత్రి.. అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా ఎలాంటి పంట, ఆస్తినష్టం జిల్లాలో సంభవించలేదని అధికారులు మంత్రికి తెలియజేశారు. త్వరలో జరగబోయే వైద్య కళాశాల ప్రారంభోత్సవం, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శంకుస్థాపన నాటికి మిగిలిన పనులన్నీ పూర్తి చేయాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతి చర్చ సందర్భంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో తోటపల్లి ప్రాజెక్ట్ కాల్వ పెండింగ్ పనులపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. మీ నియోజకవర్గంలో కాల్వ తవ్విన పరిస్థతి లేదని చంద్రబాబు చేసిన విమర్శలపై ఏమంటారు అని మీడియా ప్రశ్నించగా.. 'చంద్రబాబు ఎక్కడో కూర్చుని విమర్శలు చేస్తే ఎలా..? ఇక్కడికి వచ్చి చూడమనండి. తవ్వలేదనుకోండి.. మా ప్రజలు ఇబ్బంది పడతారు.. అప్పుడు నాకే నష్టం కదా..' అని జవాబిచ్చారు. నా నియోజకవర్గానికి ఏం చేయాలో నాకు తెలుసు. మా చీపురుపల్లి నియోజకవర్గం కుప్పంతో పోలిస్తే వంద రెట్లు బాగుంటుంది అని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి నియోజకవర్గంలో కూడా విద్యను పూర్తిగా వదిలేశారని అశోక గజపతి రాజు చేసిన విమర్శలపై మంత్రి బొత్స మాట్లాడుతూ.. అసలు టీడీపీ హయాంలో ఒక డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాలను కూడా పెట్టలేని వ్యక్తి విమర్శలు చేస్తే ఎలా అని అన్నారు. అశోక గజపతిరాజు వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా సవాల్ విసిరారు.

ప్రస్తుత వర్షాలు, ప్రజలు ముంపు కష్టాలపై ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. వర్షాలకు హైదరాబాదు పట్నమే మునిగిపోయింది.. చంద్రబాబు నిర్మించిన హైటెక్ సిటీ మునిగిపోయింది.. ఉత్తర భారత దేశం, డిల్లీ నగరమే మునిగిపోయిందని చెప్పుకొచ్చారు. ప్రత్యేక సందర్భంలో వచ్చే వర్షాలకు ముంపు సహజం. అంతేకానీ... రోజుల తరబడి ముంపు కొనసాగితే విమర్శలు చేయాలని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.