దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా వ్యాప్తంగా దుర్గాదేవి ఆలయాలు శోభయమానంగా మారాయి. పట్టువస్త్రాలు, వెండి, బంగారం నగలతో అలంకరించారు. పూజలు, అర్చనలు, హోమాలు నిర్వహించారు. దసరాను పురస్కరించుకుని మహిషాసురమర్ధిని రూప పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి చీర, సారెతోపాటూ ఘటాలు సమర్పించి.. మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
దసరా పర్వదినం.. దుర్గాదేవి ఆలయాలు శోభాయమానం
విజయనగరం జిల్లా వ్యాప్తంగా దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని దుర్గాదేవి ఆలయాలు శోభయమానంగా మారాయి.మహిషాసుర మర్ధిని రూపంలో దర్శినమిచ్చిన పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.
దసరా పర్వదినం.. దుర్గాదేవి ఆలయాలు శోభయమానం
దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా వ్యాప్తంగా దుర్గాదేవి ఆలయాలు శోభయమానంగా మారాయి. పట్టువస్త్రాలు, వెండి, బంగారం నగలతో అలంకరించారు. పూజలు, అర్చనలు, హోమాలు నిర్వహించారు. దసరాను పురస్కరించుకుని మహిషాసురమర్ధిని రూప పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి చీర, సారెతోపాటూ ఘటాలు సమర్పించి.. మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
sample description