ప్రభుత్వం ప్రకటించిన ఉచిత సరుకులు పంపిణీ.. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ కొనసాగింది. ఈ మేరకు విజయనగరం జిల్లా సాలూరు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు ఆయా రేషన్ డిపోలవద్ద బారులు తీరారు. సామాజిక దూరం పాటిస్తూ రేషన్ తీసుకున్నారు. అధికారులు ముందస్తు జాగ్రత్తలు పాటించారు. వాలంటీర్లు దగ్గరుండి సరుకులు తీసుకునే ముందు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కునేలా చేశారు.
ఇదీ చదవండి: పిల్లలూ.. బొమ్మలు ఇలా వేసేయండి..!