విజయనగరం జిల్లా పార్వతీపురంలో మద్యం దుకాణాల వద్ద వాతావరణం జాతరను తలపిస్తోంది. సామాజిక దూరం పాటించకుండా మందుబాబులు మద్యం కొనేందుకు ఆత్రుత చూపుతున్నారు. పోలీసులు స్పందించి.. వారితో భౌతిక దూరం పాటించేలా చేశారు. మరోవైపు.. పాత బస్టాండ్ దుకాణం వద్ద మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు సన్యాసిరావు, సీఐటీయు నాయకుడు వెంకట రమణ ఆబ్కారీ సీఐ అబ్దుల్ కలీం కు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై దర్యాప్తు నిర్వహించి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: