విజయనగరం జిల్లా శృంగవరపుకోట, జామి మండలాల్లో పిచ్చికుక్క స్వైర విహారం చేసి 20 మందిని గాయపరిచింది. రోడ్డున పోయే వారిపై దాడి చేసి ప్రతి ఒక్కరిని కరిచింది. శృంగవరపుకోట మండలంలో పోతనపల్లి గ్రామానికి చెందిన రామలింగం అనే వ్యక్తికి పిచ్చికుక్క దాడిలో కుడికాలు తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం సామాజిక ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి చికిత్స అందించి ఇళ్లకు పంపారు.
ఇదీ చదవండి 'అధైర్య పడొద్దు... సంసిద్ధంగా ఉన్నాం'