ETV Bharat / state

వేసవి ముందస్తు చర్యలపై జిల్లా క‌లెక్ట‌ర్ సమావేశం - క‌లెక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ తాజా సమాచారం

వేస‌విలో ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌కుండా అన్నిర‌కాల చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్.. అధికారులను ఆదేశించారు. సాధార‌ణంగా త‌లెత్తే స‌మ‌స్య‌ల ‌ప‌ట్ల ముందే అన్ని ప్ర‌భుత్వ శాఖ‌లు అప్ర‌మ‌త్త‌మై, వాటిని నివారించాల‌ని కోరారు. ముఖ్యంగా వ‌డ‌దెబ్బకు గురికాకుండా ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంపొందించాల‌ని సూచించారు.

M. Hari Jawaharlal
ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్
author img

By

Published : Mar 26, 2021, 12:42 PM IST

వేసవి సమీపిస్తుండటంతో ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌కుండా చర్యలు చేపట్టాలని విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ఆదేశించారు. వ‌డ‌దెబ్బ‌, తాగునీటి కొర‌త‌.. వంటి సమస్యలపై క‌లెక్ట‌రేట్​లో అధికారులతో సమావేశం నిర్వహించారు. బావుల్లో నీరు అడుగంటి, వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని, వాటిని నివారించేందుకు త‌గిన చర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. మున్సిపాలిటీలన్నింటిలో నీటి కొరత లేకుండా జాగ్ర‌త్త‌ వహించాలని అధికారులకు సూచించారు. నాడు నేడు ప‌నులు జ‌రుగుతున్న కారణంగా చెట్ల‌కింద త‌ర‌గ‌తుల‌ను నిర్వ‌హించ‌రాద‌ని, అవ‌స‌ర‌మైతే ఆన్‌లైన్‌లో పాఠాల‌ను బోధించాల‌ని సూచించారు. ఆశా, అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్లు, ఏఎన్ఎం స‌హ‌కారంతో, వేస‌విలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ఇంటింటి ప్ర‌చారాన్ని నిర్వ‌హించాల‌ని సూచించారు.

ఆసుపత్రుల్లో అవ‌స‌ర‌మైనే మందుల‌ను సిద్ధంగా ఉంచాల‌న్నారు. అలాగే వేసవి చివరలో వ‌ర్షాలు ప‌డిన‌ప్పుడు డ‌యేరియా వ్యాధులు ప్ర‌భ‌లుతాయ‌ని, వాటిని నివారించేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌ను చేప‌ట్టాల‌న్నారు. ఉపాధి వేత‌న‌దారుల‌కు ప‌నివేళలు మార్చాల‌ని, నీడ ఏర్పాటు చేయాల‌ని సూచించారు.

ఇదీ చదవండీ.. ఏప్రిల్ 3న పంచాయతీ పాలకవర్గాల మొదటి సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.