కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో విజయనగరంలో 69 మంది నిరుపేద కుటుంబాలకు హెల్త్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సంస్థ, సన్ రైజ్ హోమ్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు తమ వంతు సహాయం అందించామని రాష్ట్ర బాలల కమిషన్ ఛైర్మన్ అప్పారావు అన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి.