విజయనగరం జిల్లా సాలూరు మండలం మావోడు పంచాయతీ కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో వినూత్న రీతిలో బోధన సాగుతోంది. దీనికోసం ఓ ఉపాధ్యాయుడు చిత్తశుద్ధితో పని చేస్తున్నాడు. పాఠశాలలో 38 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాలకు సొంత భవనం లేదు... గ్రామంలో ఉన్న చర్చిలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. మౌలిక వసతులు లేకున్నా అటు ఉపాధ్యాయుడిలో గానీ ఇటు విద్యార్థుల్లో గాని ఎటువంటి నిరాసక్తత లేదు. ఉపాధ్యాయుడు విద్యార్థులకు ట్యాబ్లో సులువుగా లెక్కలు, తెలుగు అక్షరాలు నేర్పిస్తున్నాడు. పాఠాలను గిరిజన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా వింటున్నారు. ఉపాధ్యాయుడు వినూత్నరీతిలో బోధిస్తుంటే వాటిని విద్యార్థులు అనుసరిస్తున్నారు. మారుమూల గిరిజన గ్రామంలో డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ఇదీచూడండి.వసతి గృహంలో బాలికలను వేధిస్తోన్న మృగాడు