విజయనగం జిల్లా సాలూరు మండలం గిరిశిఖర గ్రామాలైన... కోదామ, మొనంగి, పగులు చెన్నూరు, పొట్టు చెన్నూరు, ఇలాంటి ఎన్నో గిరిజన గ్రామాలకు మంచిరోజులు వచ్చాయి. ఇది వరకు రోడ్లు లేకపోవడం వల్ల గిరీష్ ఎకరాల నుంచి మైదాన ప్రాంతానికి రావడానికి ప్రజలు చాలా కష్టాలు పడేవారు. అంతే కాకుండా ఆంధ్ర ఒడిస్సా వివాదాస్పదంగా 22 గ్రామాలు ఉన్నాయి. ఒడిస్సా నుంచి వివాదాస్పద గ్రామాలైన గంజాయి భద్ర, కోటియా, పగలు చెన్నారుకు, డెన్స్రాయి వంటి గ్రామాలకు ఒడిస్సా ప్రభుత్వం అభివృద్ధి పనులు జరుపుతున్నాయి.
మనం వేసే రోడ్లు వాళ్లు వేయకుండా, వాళ్లు వేసే రోడ్లు మనం వేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుని అభివృద్ధి పనులు చేస్తున్నారు. మొట్టమెదటిసారిగా గిరిశిఖర గ్రామాల నుంచి మైదాన ప్రాంతానికి రావడానికి 80శాతం రోడ్ల పనులు జరుగుతున్నాయి. ఒక్క బ్యాచ్ రోడ్డు పనులు జరిగితే 100 శాతం రోడ్లు పూర్తయినట్లే.
కురుకూటి గ్రామం నుంచి డెన్స్రాయి, రూడీ, సంపంగిపాడు, సిరివర ... రోడ్లు లేని సమయంలో గర్భిణులు డోలే కట్టుకుని దిగడం, రేషన్ డిపోకి రావడానికి ఎంతో ఇబ్బంది పడేవారు. ఈ నాలుగు గ్రామాలకు రోడ్లు పూర్తయితే 100 శాతం రోడ్లు పూర్తయినట్లే అని ఏపీ ప్రాజెక్టు ఏఈ లోకనాథం తెలిపారు. ఒడిస్సా ప్రభుత్వం అయినా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా చేసే పనులు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతాయని ఆయన అన్నారు.
ఇవీ చూడండి:అమరావతిలో కరకట్ట రహదారి విస్తరణ..?