పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి - అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి
ఉపాధిహామీ పథకం కింద మంజూరైన పలు అభివృద్ధి పనులకు... డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి శంకుస్థాపన చేశారు. కురుపాంలోని జూనియర్ కళాశాల ఆవరణలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. రూ.5,733.90 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, చెక్‌డ్యాంలు, ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రారంభించారు. విభిన్న ప్రతిభావంతులకు, వయోవృద్ధులకు సహాయ ఉపకరణాల పంపిణీ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో... వారికి కావాల్సిన కృత్రిమ అవయవాలను అందజేస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అభివృద్ధి పనులకు డిప్యూటి సీఎం పుష్పశ్రీవాణి శంకుస్థాపన
Intro:అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిBody:విజయనగరం జిల్లా, కురుపాం నియోజకవర్గ పరిధిలో గల 5 మండల్లాలో ఉపాధిహామీ పథకం క్రింద మంజూరైన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి పాల్గొన్నారు. 5733.90 లక్షల రూపాయతో నిర్మించనున్న సిసిరోడ్లు,చెక్ డ్యాంలు,ప్రహరీ గోడలుకు చెందిన పనుల యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని కురుపాం జూనియర్ కళాశాల ఆవరణలో చేపట్టారు..అనంతరం విభిన్న ప్రతిభా వంతులకు మరియు వయో వృద్దులకు, సియం చేపట్టిన సహాయ ఉపకరణాలు పంపిణీ కి రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ విభిన్న ప్రతిభ వంతుల కార్యక్రమన్నీ ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉందని, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి ట్రై సైకిళ్ళు, చంక కర్రలు, చెవిటి మిషన్లు, అందులకు వాకింగ్ స్టిక్స్, కృత్రిమ అవయవాలను ప్రభుత్వం అందజేయడం జరుగుతుందని అన్నారు. ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకొని వారు చేయించుకోవాలని కోరారు. ఈ అవయవాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఐటీడీఏ పిఓ డా.బి.ఆర్.అంబేడ్కర్, ఐటీడీఏ ఇ.ఇ. మోహన్ తదితరులు పాల్గొన్నారు. Conclusion:కురుపాం నియోజకవర్గంలో