అధికారులు, ప్రజాప్రతినిథులు, ప్రజల సమష్టి కృషి, అధికార యంత్రాంగం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యల కారణంగా విజయనగరం జిల్లా గ్రీన్ జోన్లో ఉందని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి గిరిజన కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా గ్రీన్ జోన్లో ఉన్న కారణంగా ఈనెల 20 తర్వాత లాక్ డౌన్ ఆంక్షల్లో కొంత సడలింపులు వచ్చే అవకాశం ఉందన్నారు. అప్పటిదాకా ప్రజలు సహకరించాలని కోరారు. కరోనా విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. బయటనుంచి ఎవరైనా జిల్లాకు వస్తే వారి గురించి సమాచారం ఇవ్వాలని కోరారు. క్వారంటైన్లో ఉన్నవారు బయటకు వెళ్లేటప్పుడు రూ. 2వేలు ఆర్థికసాయం చేస్తామని తెలిపారు.
ఇవీ చదవండి.. నెల రోజుల్లో లక్ష మాస్కులు తయారు చేసిన కడప ఖైదీలు