Asha Workers State Maha Sabha: విజయనగరంలో రెండు రోజుల పాటు ఆశావర్కర్ల యూనియన్ 4వ రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించి, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని ఆశావర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మహాసభలో తీసుకున్న తీర్మానాలను ధనలక్ష్మి మీడియాకు వివరించారు.
ఈ మహాసభలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, వైద్య రంగంలో వస్తున్న మార్పులు, ఆశాలు ఎదుర్కొంటున్న సమస్యలు.. వాటి సాధన కోసం చేయాల్సిన పనులు.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించామన్నారు. అదేవిధంగా ప్రభుత్వం పరిష్కరించాల్సిన పలు అంశాలపైనా తీర్మానాలు చేశామని తెలిపారు. ప్రధానంగా ఆశావర్కర్లను కార్మికులుగా గుర్తించి,.. కనీస వేతనం 26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశావర్కర్లకు ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవులు, మెటర్నిటీ సెలవులు అమలు చేయాలన్నారు.
చనిపోయిన ఆశావర్కర్లకు రూ.10లక్షలు పరిహారం చెల్లించాలని,.. చనిపోయిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని.. గ్రూపు ఇన్సూరెన్స్ రూ.10 లక్షలు కల్పించి వీటితో పాటు ఉద్యోగ విరమణ సదుపాయాలను ఆశాలకు వర్తింపచేయాలని మహాసభల్లో తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఏఎన్ఎం శిక్షణ పొందిన ఆశా వర్కర్లు కు ఏఎన్ఎం పోస్టుల భర్తీలో ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. మహాసభలో చేసిన తీర్మానాల సాధనకు పోరాటాలు నిర్వహిస్తామని ధనలక్ష్మి స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: