విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం నొండ్రుకోన గ్రామానికి చెందిన మండంగి దాసమ్మకు బుధవారం పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలో ఉన్న దుడ్డుఖల్లు ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి కురుపాం పీహెచ్‌సీకి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి బిడ్డ అడ్డం తిరిగిందని... పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువెళ్ళాలని సూచించారు. గర్భిణిని అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.
ఆ వెంటనే ఎన్ఎస్సీయూకి శిశువును తీసుకువెళ్తుండగా.. పాప మృతి చెందింది. లాక్డౌన్ కారణంగా ఏజన్సీలో వాహనాలు తిరగకపోవడమే మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొని వెళ్ళడానికి తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. సీహెచ్‌సీ, ఎన్ఎస్సీయూలకు ఒకే వైద్యుడు విధులు నిర్వహించడం వలనే ఇలా జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. కరోనా భయంతో షిఫ్ట్‌ల కారణంగా ప్రసూతి, చిన్న పిల్లల వైద్యులు అందుబాటులో లేరని.. ఇలా అయితే ప్రజల ఆరోగ్యం పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చదవండి: