Cyber crime: విజయనగరం జిల్లా మరిపల్లి గ్రామంలో పలువురు యువకులు ఆన్లైన్ మోసానికి బలై.. రూ. 30 లక్షలు పోగొట్టుకున్నారు. KNC అనే యాప్ ద్వారా అమాయకులకు గాలం వేసిన సైబర్ నేరగాళ్లు.. ఆన్‌లైన్‌లో ఓ ప్రొడక్ట్ కొనుగోలు చేసి పెట్టుబడి పెట్టడంతో పాటు మరికొందరితో కోనుగోలు చేయిస్తే మీ పెట్టుబడి 40 రోజుల్లో రెట్టింపు అవుతుందని నమ్మబలికారు.
ఇది నమ్మిన గ్రామానికి చెందిన పలువురు యువకులు రూ. 5 వేల నుంచి రూ. లక్ష వరకూ పెట్టుబడి పెట్టారు. యాప్లో ఇచ్చిన గడువు ముగిసినా ఇప్పటికీ డబ్బులు రాకపోగా.. ప్లే స్టోర్ నుంచి యాప్ కనిపించకుండాపోవటంతో తామంతా మోసపోయామని గ్రహించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించగా..కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆన్‌లైన్‌లో మోసాలకు గురై తంటాలు పడటం కంటే ముందుగానే అప్రమత్తంగా ఉంటే సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశముండదని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి
Latest Trends in Cybercrime: 5 సెకన్లు నగ్నంగా కనిపిస్తారు.. చూశారంటే ఇక అంతే..!