విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని మామిడిపల్లి నుంచి శంబర మీదుగా మక్కువ మండలం కేంద్రానికి రహదారి పనులు ప్రారంభమయ్యాయి. గతంలో చీపురువలస గ్రామం నుంచి శంబర వరకు రహదారిని నిర్మించారు. కానీ మామిడిపల్లి నుంచి చీపురువలస వరకు రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో అక్కడ గ్రామస్థులు వైకాపా ఎమ్మెల్యే దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లారు. ఆయన రహదారి నిర్మాణానికి కృషి చేశారు. మామిడిపల్లి నుంచి శంబర మీదుగా మక్కువ మండల కేంద్రానికి 14 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.8కోట్ల రూపాయల నిధులు మంజూరు కాగా పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కల్వర్ట్ పనులు చేస్తున్నారు. ఇవి పూర్తయిన వెంటనే ఈ రహదారి నిర్మాణ పనులు చేస్తామని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండీ.. Lovers suicide: విషాదం.. ప్రేమ జంట ఆత్మహత్య