విజయనగరం జిల్లాలోని మహారాజ కళాశాల ప్రవేశాల అనుమతులపై మంత్రి బొత్స చేసిన ప్రకటనను సీపీయం పార్టీ నేత కృష్ణమూర్తి తీవ్రంగా ఖండించారు. ఎటువంటి ప్రత్యామ్నాయం చెప్పకుండా అడ్మిషన్లు నిలిపివేయడం మూర్ఖపు చర్య అంటూ ధ్వజమెత్తారు.
ఈ సంవత్సరం అడ్మిషన్లు ఆపేస్తే రెండో సంవత్సరానికి విద్యార్థులు ఉండరని, ఆ తర్వాత మూడో సంవత్సరానికి విద్యార్థులు ఉండరని, చివరికి ఎంఆర్ కాలేజ్ ఉండదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో చరిత్ర ఉన్న మహారాజ కళాశాలను ఈ స్థితికి తీసుకురావటం దారుణమన్నారు. కళాశాలను కాపాడుకునేందుకు విద్యార్థులు, స్థానికులు, మేధావులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.