పేదలపై అధిక విద్యుత్ ఛార్జీల భారాన్ని నిరసిస్తూ విజయనగరం విద్యుత్ భవన్ ఎదుట సీపీఐ, సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ చట్ట సవరణ బిల్లు 2020ను ద్వారా ప్రవేశపెట్టనుండడం చాలా హేయమైన చర్య అన్నారు.
కేంద్రం ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని సీపీఐ నాయకుడు బుగత అశోక్ డిమాండ్ చేశారు. అలాగే.. రాష్ట్రంలో కొత్తగా అమలు చేసిన విద్యుత్ ఛార్జీల డైనమిక్ విధానాన్ని తీసివేసి... బిల్లుల లెక్కింపునకు పాత విధానాన్ని అనుసరించాలన్నారు.
ఇదీ చదవండి: