విజయనగరం జిల్లా బొబ్బిలి కొవిడ్ కేర్ కేంద్రంలో కరోనా రోగులు ఆటపాటలతో ఆనందంగా గడుపుతున్నారు. వారికి సోకిన వ్యాధిని మరిచి ఉల్లాసంగా సేద దీరుతున్నారు. చదరంగం, వాలీబాల్, షటిల్ తదితర క్రీడల్లో రోగులు బిజీగా గడుపుతున్నారు. ఉదయం, సాయంత్రం ఇలా ఆటల్లో తలమునకలయ్యారు. వారికి కావాల్సిన క్రీడా సామాగ్రిని అధికారులు సమకూర్చారు. రోగులకు ఆక్సిజన్ స్థాయి పెంచేందుకు బెలూన్లు ఊదిస్తున్నారు. ఇలా వ్యాధిని మరిచి రోగులు మనోధైర్యంతో ముందుకు సాగుతున్నారు.
ఇదీ చదవండి: 'నారదా స్టింగ్ కేసు'లో మంత్రులకు గృహ నిర్బంధం
జిల్లా సంయుక్త కలెక్టర్ కిశోర్ కుమార్ సైతం ఇటీవల రోగులతో వాలీబాల్ ఆడి మనో ధైర్యాన్ని నింపారు. వారి ఆటలను చరవాణుల్లో బంధించి ఆ వీడియోలను కుటుంబ సభ్యులకు పంపడంతో.. వారు మరింత ఆనందపడుతున్నారు. వైరస్ బాధితుల కోసం.. గిరిజన ఆశ్రమ పాఠశాలను కొవిడ్ కేంద్రంగా మార్చారు. చుట్టుపక్కల ఆరు మండలాల నుంచి దాదాపు 180 మంది రోగులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి: