విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఉన్న గిరిశిఖర గర్భిణుల వాస్తు గ్రామంలో.. కొందరికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్థరణ అయ్యింది. కొండకోనల్లో ఉన్న గిరిజన గర్భిణులకు.. వైద్యులు సకాలంలో మెరుగైన వైద్యం, పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ఈ వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు.
ఇలాంటి కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న నలుగురికి కరోనా సోకింది. అప్రమత్తమైన అధికారులు.. వారిని ఆసుపత్రిలో చేర్చి అవసరమైన వైద్యం అందిస్తున్నారు. వారికి అవసరమైన ఆక్సిజన్ సైతం అందుబాటులో ఉంచారు. కరోనా మొదట విడతలో గర్భిణులకు రక్షణ కల్పించారు. వరుసగా రెండు రోజులకు ఒకసారి ఇద్దరు చొప్పున వ్యాధి బారిన పడ్డారని అధికారులు తెలిపారు. కేంద్రంలో ఉన్న మిగిలినవారు.. భయంతో వారి ఇళ్లకు వెళ్లిపోయారు.
ఇదీ చదవండి:
కోవిడ్ చిచ్చు: భార్యను చంపిన భర్త ... 108కి ఫోన్ చేసినా రాలేదని ఆత్మహత్యాయత్నం