విజయనగరం జిల్లా బొబ్బిలి వేణుగోపాలస్వామి, శ్రీకాకుళం జిల్లా గగుళ్ల సీతారాంపురం సీతారామస్వామి ఆలయాలకు సంబంధించిన ఆభరణాలు లెక్కింపు పూర్తైంది. బొబ్బిలి కోటలోని భాండాగారంలో ఉన్న వెండి, ఇత్తడి వస్తువుల లెక్కింపు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో లెక్కించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త సుజయ్ కృష్ణ రంగారావు, విజయవాడ కనకదుర్గమ్మ ఈవో భ్రమరాంబ, పలు జిల్లాలకు చెందిన ఏసీల ఆధ్వర్యంలో లెక్కింపు చేపట్టారు.
ఆభరణాల లెక్కలు పూర్తిగా సరిపోయాయని ధర్మకర్త సుజయ్‌కృష్ణ తెలిపారు. తమ పూర్వీకులు ఇచ్చిన 4 వేల ఎకరాల లెక్కలు కూడా తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగలను కోటలో భద్రపరిస్తే తమపై దుష్ప్రచారం చేశారన్నారు. ఇకపై నగల భద్రత బాధ్యత తీసుకోబోమని..,ఈ విషయమై ప్రభుత్వానికి లేఖ రాస్తామని ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి: దేవదాయశాఖ అధికారుల సమక్షంలో ఆలయాల ఆభరణాలు లెక్కింపు