విజయనగరం జిల్లా వ్యాప్తంగా చిన్న, పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు 500వరకు ఉన్నాయి. వీటిపై ఆధారపడి ప్రత్యేక్షంగా, పరోక్షంగా సుమారు 50 వేల మంది ఉన్నారు. ఆహార ప్రియుల అలవాట్లకు తగ్గట్టుగా జిల్లాలో పలు హోటళ్లు షడ్రుచులతో ఆహారాన్ని తయారు చేసి ఆదరణ దిశగా సాగుతున్నాయి.
ఏ హోటల్ చూసినా ఖాళీ ఉండేది కాదు..
వాస్తవానికి మిగిలిన చోట్ల వారానికి ఒకరోజు మాత్రమే సెలవు దినం. విజయనగరం జిల్లా విషయానికొస్తే., ముఖ్యంగా జిల్లా కేంద్రంలో అసంఘటిత రంగ వర్గానికి మంగళవారం., ప్రభుత్వ, ఇతర సంస్థలకు ఆదివారం సెలవు కావటం వల్ల ఈ రెండు రోజులు ఏ హోటల్ చూసినా ఖాళీ ఉండదు. కుటుంబ సమేతంగా తరలొచ్చి నచ్చిన వంటకాలను ఆరగిస్తుంటారు. అయితే... కరోనాతో సీన్ మారింది. లాక్డౌన్ ఎత్తివేసినా చాలామంది హోటళ్లకు రావడానిక జంకుతున్నారు. సాధారణ రోజుల్లో, వారాంతాల్లో కూర్చోవడానికి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాయి. పట్టణాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటం వల్ల హోటళ్లు వెలవెలబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోనే ఉన్న దాంట్లో వంట చేసుకొని కానిచ్చేస్తున్నారు. పొదుపు మంత్రం జపిస్తున్నారు.
అమగ్యగోచరం..
ఈ నేపథ్యంలో అతిథ్య రంగం పరిస్థితి అమగ్యగోచరంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హోటళ్లు తెరిచినా నిర్వహణ కష్టంగా ఉంది. విద్యుత్తు, భవనాల కిరాయిలు లక్షల్లో ఉన్నాయి. ఇదే సమయంలో నిత్యావసరుకులు, కూరగాయల ధరలు బాగా పెరిగాయి. పోని ఎవరైన తినడానికి వస్తున్నారా అంటే అదీలేదని హోటళ్ల నిర్వాహకులు వాపోతున్నారు.
వ్యయ భారం..
చిన్న హోటళ్లు, రెస్టారెంట్లలో జీతాలు, నిర్వహరణ ఖర్చుకు నెలకు సుమారు 2 నుంచి 4 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇదే సమయంలో కరోనాతో చాలామంది హోటళ్లకు రావటం మానేశారు. అవసరమైతే ఇళ్ల నుంచే బాక్సులు తీసుకెళ్తున్నారు. నిర్వహణ ఖర్చులకు కూడా డబ్బులు రావటం లేదు. వీటిపై ఆధారపడిన ఎంత మంది ఇబ్బందులు పడుతున్నారు. ఏమి చేయలేని పరిస్థితి. మాకూ విద్యుత్తు బిల్లులు, ఇతర ఖర్చులు తప్పటం లేదు. లాక్డౌన్ నిబంధనలు సడలించటంతో హోటళ్లు తెరిచినా వారు., నడవకపోవటంతో తిరిగి మూసివేయాల్సిన పరిస్థితి నెలకొందని హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి...
హోటళ్లు, రెస్టారెంట్లలో వంట మనషులు, వెయిటర్లు, సూపర్ వైజర్లు, క్యాషియర్లుగా పని చేస్తుంటారు. పరోక్షంగా కూరగాయలు, పాలు, నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తుంటారు. ప్రస్తుత పరిస్థితుల ప్రభావం వీరిందరిపైనా పడింది. కొన్ని పెద్దపెద్ద హోటళ్లలో శుభకార్యాలు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పరిమిత సంఖ్యలో చేసుకోవటంతో ఇవీ మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో అతిథ్య రంగాన్నికి కూడా ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించాలని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి: