ETV Bharat / state

Construction Cost Increased: సామాన్యులకు సొంతింటి కల ఇక కష్టమే.. ! - ఏపీలో భారీగా పెరిగిన సీనరేజ్‌ రుసుము

Own house is not easy : సామాన్యుల సొంతింటి కల ఇక కష్టంగా మారనుంది. ఓ వైపు అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న నిర్మాణ సామగ్రి ధరలకు తోడుగా.. రాబడి పెంచుకోవడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం ఖనిజాలపై భారం మోపింది. సీనరేజ్‌, ఇతర రుసుములను భారీగా పెంచేసింది. దీంతో లీజుదారులు, వ్యాపారులు, సొంత ఇల్లు నిర్మించుకోవాలనుకున్న వారు గగ్గోలు పెడుతున్నారు.

Construction Cost increased
Construction Cost increased
author img

By

Published : Jan 1, 2022, 9:35 AM IST

Construction Cost increased: ఇళ్ల నిర్మాణంలో వినియోగించే కంకర 20 టన్నుల లారీ లోడు పలు జిల్లాల్లో రూ.10 వేలకు లభించేది. ఇప్పుడు టన్నుపై రూ.150-200 వరకు ధర పెరగడంతో లారీ లోడు రూ.14 వేలకు చేరింది. గ్రానైట్‌ వివిధ రకాలకు అనుగుణంగా చదరపు అడుగు రూ.60 నుంచి రూ.130కి లభించేది. ప్రస్తుతం చదరపు అడుగుపై రూ.15-20 వరకు పెరిగింది. రాష్ట్రంలో కొంతకాలంగా నిర్మాణ రంగం నీరసించింది. ప్రభుత్వపరంగా నిర్మాణాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అపార్ట్‌మెంట్లు, సొంత ఇళ్ల నిర్మాణాల సంఖ్య తక్కువగానే ఉంది. కంకర, మొరం, గ్రానైట్‌ వంటి వ్యాపారాలు సగానికిపైగా తగ్గిపోయాయి. ఇటువంటి తరుణంలో ప్రభుత్వం రాబడి పెంచుకోవడమే లక్ష్యంగా ఖనిజాలపై భారం మోపింది. సీనరేజ్‌, ఇతర రుసుములను భారీగా పెంచేసింది. దీంతో లీజుదారులు, వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. అంతిమ భారం ఇళ్లు నిర్మించుకునే సామాన్య, మధ్యతరగతి వర్గాలపై పడుతోంది.

నాలుగు ఉత్తర్వులతో బాదుడు..

జీవో 42: గ్రానైట్‌ మినహా ఇతర చిన్నతరహా ఖనిజాలకు సీనరేజ్‌ ఫీజుతోపాటు అంతే మొత్తాన్ని కన్సిడరేషన్‌ నగదుగా అదనంగా చెల్లించాలి. అంటే గతంలో రహదారి కంకర టన్నుకు రూ.60 సీనరేజ్‌ ఫీజు ఉండగా, ఇపుడు కన్సిడరేషన్‌ నగదుతో కలిపి రూ.120 అయింది. గ్రానైట్‌కు సీనరేజ్‌ ఫీజుతోపాటు అందులో 50% కన్సిడరేషన్‌ నగదు చెల్లించాల్సి వస్తోంది. వీటికి మళ్లీ జిల్లా ఖనిజ నిధి, మెరిట్‌ అదనంగా ఉంటుంది.

జీవో 65: కొత్తగా లీజులకు దరఖాస్తు చేసుకునేవారు.. విస్తీర్ణానికి అనుగుణంగా చెల్లించే వార్షిక డెడ్‌రెంట్‌ విలువకు పది రెట్లు సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలి. ఇప్పటికే లీజులు ఉన్నవారు అయిదు రెట్లు చెల్లించాలి. అంటే గ్రానైట్‌కు హెక్టారుకు వార్షిక డెడ్‌రెంట్‌ రూ.1.30 లక్షలు ఉందనుకుంటే... కొత్త దరఖాస్తుదారులు రూ.13 లక్షలు, ప్రస్తుత లీజుదారులు రూ.6.50 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలి.

జీవో 90: మైనింగ్‌ ప్లాన్‌ ప్రకారం తొలిఏడాది 10%, రెండో ఏడాది 20%, మూడో ఏడాది 40%, నాలుగో ఏడాది నుంచి 60% మేర ఖనిజ ఉత్పత్తి చేయాలి. అంత ఉత్పత్తి లేకున్నా... ఈ మేరకు సీనరేజ్‌ చెల్లించాల్సి ఉంటుంది.

జీవో 13: పీసీబీ ఇచ్చే కన్సెంట్‌ ఫర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (సీఎఫ్‌ఈ), కన్సెంట్‌ ఫర్‌ ఆపరేషన్‌ (సీఎఫ్‌వో) అనుమతి ఫీజులు భారీగా పెరిగాయి. గతంలో టర్నోవర్‌ బట్టి ఉండగా, ఇపుడు విస్తీర్ణం, ఉత్పత్తి ఆధారంగా.. టన్ను, క్యూబిక్‌ మీటర్‌ చొప్పున చెల్లించాలి.

పక్క రాష్ట్రాల్లోనే తక్కువ..

కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ఖనిజాలు మనతో పోలిస్తే తక్కువకే లభిస్తున్నాయి. ఈ ప్రభావం వీటిని ఆనుకొని ఉన్న జిల్లాల్లో కనిపిస్తోంది. గతంలో మన రాష్ట్రం నుంచి ఖనిజం ఇతర రాష్ట్రాలకు సరఫరా అయ్యేది. ప్రస్తుతం వాటి నుంచి ఏపీకి ఎక్కువగా వస్తోంది.

గ్రానైట్‌పై అడుగుకు రూ.15 పెరిగింది..

మన రాష్ట్రంలో లభించే వివిధ రకాల గ్రానైట్‌ కావాలనుకునే వినియోగదారులపై అడుగుకు రూ.15 నుంచి రూ.20 అదనంగా తీసుకోవాల్సి వస్తోంది. పక్క రాష్ట్రాల్లో ఇన్ని రకాల ఫీజులు, పన్నులు లేకపోవడంతో గ్రానైట్‌ తక్కువ ధరకు లభిస్తోంది. అందుకే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ నుంచి తెచ్చిన మెటీరియల్‌ 50% విక్రయిస్తున్నాం. వాస్తవానికి గతంలో పోలిస్తే వ్యాపారాలు 50% తగ్గిపోయాయి. -బి.శ్రీనివాసరావు, విజయవాడ మార్బుల్‌, గ్రానైట్‌ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు

ఆదాయం పెంచుకోవడమే ప్రభుత్వ లక్ష్యం..

ఆదాయం పెంచుకోవడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. చిన్న తరహా ఖనిజాల రంగాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెట్టడం లేదు. నాలుగు ఉత్తర్వులపై ఓ కమిటీని నియమించి, సమీక్షించి రద్దు చేయాలి. ఇలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో సంబంధిత లీజుదారులు, పరిశ్రమల సంఘాలతో సంప్రదింపులు చేసి, సూచనలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇదే విధానాన్ని పాటిస్తోంది. -డాక్టర్‌ సీహెచ్‌ రావు, ఫెమి, ప్రధాన కార్యదర్శి

ఇదీ చదవండి: Calender In Match Box: అగ్గిపెట్టెలో పట్టే క్యాలెండర్‌.. సుక్ష్మకళాకారుడి టాలెంట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.