Constable Suspicious Death in Vizianagaram: విజయనగరం జిల్లా తోటపల్లి ఐటీడీఏ పార్కు వద్ద ఓ కానిస్టేబుల్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. సదరు వ్యక్తి గరుగుబిల్లి మండలం నందివానివలస గ్రామానికి చెందిన డొకాల శ్రీనివాస్ నాయుడుగా పోలీసులు గుర్తించారు. మృతుడు విశాఖపట్నం పి.యం పాలెం పీఎస్లో విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
2021 డిసెంబర్ నెల 31 నుంచి శ్రీనివాస్ నాయుడు ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు గరుగుబిల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి..
Vanama Raghava judicial custody: వనమా రాఘవకు.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్