కురుపాంలో కాంగ్రెస్ అభ్యర్థి నిమ్మక సింహాచలం ప్రచారం విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక సింహాచలం విస్తృతంగా ప్రచారం చేశారు. పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోనుప్రజలకు వివరించారు. కురుపాంలో రోడ్ షో చేసిన ఆయన... కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.రాహూల్ ప్రధాని అయితే.. ప్రథమంగా ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తారని చెప్పారు. కనీస ఆదాయం పథకంతో పేదరికం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ చేసిన పొరపాట్లను దిద్దుకుంటుందన్న ఆయన ఏపీ ప్రజలు కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇవ్వలని కోరారు.ఇవీ చూడండి :నన్ను బెదిరించారు'... జయప్రద కంటతడి