పీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మూడు బిల్లులను వ్యతిరేకిస్తూ విజయనగరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. బాలాజీ జంక్షన్ కూడలిలో వున్న డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ సంబంధిత మూడు బిల్లులు రైతు ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్ అన్నారు. భాజపా, వైకాపాలు రైతులకు అన్యాయం చేసే పార్టీలని విమర్శించారు. రైతులకు నష్టం చేసే ఈ బిల్లులను ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...