విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాలిటీ పరిధిలో అర్బన్ హౌసింగ్ స్కీం కింద 1460 ఇళ్లను గత తెలుగుదేశం ప్రభుత్వం లాటరీ విధానంలో లబ్ధిదారులకు మంజూరు చేసింది. ప్రభుత్వం మారటంతో ఆ నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పుడు వైకాపా సర్కార్ వాటిని పూర్తి చేసి అప్పడు ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇవ్వాలని తెదేపా నాయకులు నిరసన చేశారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే లబ్దిదారులకు ఇళ్లు ఇవ్వడం లేదని ఆవేదన చెందారు. నివాసయోగ్యం కాని స్థలాలను వైకాపా వారి నాయకుల స్వలాభం కోసం అధిక ధరలకు తీసుకుందని ఆరోపించారు. బలవంతంగా లబ్దిదారుల సంతకాలు తీసుకున్నారని ఆక్షేపించారు. ఆ పనికిరాని స్థలాలలో ఎనిమిదో తేదీన పట్టాల పంపిణీకి సిద్దమవుతున్నారని ఎద్దేవా చేశారు. వెంటనే ప్రభుత్వం ఈ దుశ్చర్యలను ఆపి.. అప్పటి లబ్ధిదారులకు ఇళ్లు పూర్తి చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: 'తెదేపా హయాంలో మంజూరైన ఇళ్లకు బిల్లులు చెల్లించండి'