కొవిడ్ టీకాపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వేస్తామని విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ తెలియజేశారు. కొవిషీల్డ్, కోవాగ్జీన్ ఏదైనా నిర్దేశించిన గడువు తర్వాతే రెండో డోసు వేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా టీకా ప్రక్రియ కొనసాగుతోందని.. అర్హులందరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ చికిత్స, వ్యాక్సినేషన్, బ్లాక్ ఫంగస్ తదితర అంశాలపై ప్రజల ఇబ్బందులను, సందేహాలను తీర్చేందుకు ఈటీవీ-ఈనాడు ఫోన్ ఇన్ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరి జవహర్ లాల్, డీఎంహెచ్వో, రమణకుమారి, డీసీహెచ్వో నాగభూషణం, జిల్లా కేంద్ర ఆసుపత్రి పర్యవేక్షకులు సీతారామరాజు పాల్గొన్నారు. ప్రజలతో మాట్లాడి వారు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ సమాధానమించారు. జిల్లాలో మూడంచెల వ్యూహంతో కొవిడ్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఇవీ చూడండి..