ETV Bharat / state

ఫిబ్రవరి 1 నుంచి ఇంటి వద్దకే రేషన్ బియ్యం: కలెక్టర్ - రేషన్ బియ్యం ఇళ్ల వద్దకే పంపీణీ కార్యక్రమం తాజా సమాచారం

విజయనగరం జిల్లాలో ఫిబ్రవరి 1 నుంచి రేషన్ బియ్యాన్ని ఇంటి వద్దకే అందించనున్నట్లు కలెక్టర్ డా.ఎం. హరి జవహర్ లాల్ పేర్కొన్నారు. ఇప్పటికే వాహనాలు జిల్లాకు చేరుకున్నాయని వెల్లడించారు. పెరేడ్ గ్రౌండ్ లో లబ్దిదారులందరికి వాహనాలను కేటాయించనున్నట్లు తెలిపారు.

Collector Dr.M. Hari Jawaharlal
విజయనగరంలో ఫిబ్రవరి 1 నుంచి ఇంటి వద్దకే రేషన్ బియ్యం
author img

By

Published : Jan 20, 2021, 1:14 PM IST

విజయనగరం జిల్లాలోని బియ్యం కార్డుదారులందరికి ఫిబ్రవరి 1వ తేది నుంచి రేషన్ బియ్యాన్ని ఇంటి వద్దకే అందించనున్నట్లు కలెక్టర్ డా.ఎం. హరి జవహర్ లాల్ పేర్కొన్నారు. ఇప్పటికే వాహనాలు జిల్లాకు చేరుకోగా.. రేపు ఉదయం పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో లబ్దిదారులందరికి వాహనాలను అందించనున్నారు. జిల్లా కోసం మెుత్తం 458 వాహనాలను కేటాయించారని తెలిపారు. ఈ వాహనాల ద్వారా జిల్లాలోని 778 సచివాలయాల పరిధిలో ఉన్న.. 1407 రేషన్ దుకాణాల నుంచి ఇంటింటికీ రేషన్ అందజేస్తామని వివరించారు. ప్రతి వాహనం ద్వారా సుమారు 1500 కార్డు దారులకు రేషన్ సరఫరా అందించనున్నట్లు పేర్కొన్నారు.

పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక...

లబ్దిదారుల ఎంపిక రిజర్వేషన్ ప్రకారంగా పారదర్శకంగా జరిగిందని కలెక్టర్ చెప్పారు. మండల స్థాయి స్క్రీనింగ్ కమిటి ఎంపిక చేసిన వారి జాబితాలను జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆమోదించిన తర్వాత లబ్ధిదారులను ఎంపిక చేసినట్టు చెప్పారు. వాహనాలను నడిపే ప్రతి ఆపరేటర్ కు ఒక వి.ఆర్.ఓ ను నోడల్ అధికారిగా డిజిగ్నేట్ చేశామన్నారు. వీరి పర్యవేక్షణ లో రేషన్ సరఫరా జరుగుతుందని చెప్పారు.

ఆపరేటర్లకు టిషర్టులను ఏక రూప దుస్తులుగా ఇస్తామని.. ప్రతి వాహనం రిజిస్ట్రేషన్, ఇన్సురెన్సు , బ్యాంకు ఋణం... అవసరాలను సంయుక్త కలెక్టర్ (అభివృద్ధి) పర్యవేక్షిస్తారని తెలిపారు. పంపిణీ విధానం, ఈ పోస్, తూకం, ఇంటర్ నెట్ వినియోగం.. అంశాల పై శిక్షణ ఉంటుందని వివరించారు. ఆపరేటర్లు, గ్రామాల్లోనున్న డీలర్లు, వాలంటీర్ లను పరిచయం చేసుకొని రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంటారని అన్నారు. పంపిణీకి ఒక రోజు ముందే సామగ్రి అందజేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.