విజయనగరం జిల్లా చీపురుపల్లిలో సేవ్ మాన్సాస్-సేవ్ ఎడ్యుకేషన్ పేరిట తెదేపా నేతలు సంతకాలు సేకరించారు. విజయనగరం తెదేపా పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికే ఎంఆర్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టామని ఆయన చెప్పారు.
ఎంతోమంది పేదలను ఉన్నతంగా నిలబెట్టిన మాన్సాస్ విద్యా సంస్థలు ప్రస్తుతం రోడ్డున పడే ప్రమాదం వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జూనియర్ కాలేజీ మూసివేసి, డిగ్రీ జీరో ఇయర్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆరోపించారు. నష్టాల పేరుతో మాన్సాస్ సంస్థ భూములను కాజేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కళాశాలను ప్రైవేటీకరించకుండా ప్రజా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: