ETV Bharat / state

స్వార్థపరుల అడ్డంకుల వల్లే ఇళ్ల పట్టాల పంపిణీ ఆలస్యం : సీఎం - gunkalam housing sites distribution by cm jagan

సంక్రాంతి పండగ ముందే వచ్చినట్లుగా.. పేద ప్రజలకు నగదుతో పాటు స్థిరాస్తి అందించే మహాయజ్ఞం చేపట్టామని సీఎం జగన్ అన్నారు. విజయనగరం మండలం గుంకలాంలో 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 397.36 ఎకరాల్లో ఇళ్ల పట్టాల పంపిణీకి లే అవుట్‌ పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. 30.75 లక్షల ఇళ్ల స్థలాల్లో.. 28 లక్షల 30 వేల గృహాలను నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ పనులను రెండు దశల్లో పూర్తిచేయబోతున్నామన్నారు.

CM Jagan
CM Jagan
author img

By

Published : Dec 30, 2020, 1:58 PM IST

Updated : Dec 30, 2020, 9:16 PM IST

కొందరు స్వార్ధపరులు న్యాయపరమైన అడ్డుంకులు సృష్టించగా.. 3.74 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని విజయనగరం పర్యటనలో సీఎం జగన్ తెలిపారు. గుంకలాంలో 'నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమంలో ఆయన పాల్గొని.. 12,301 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. అమరావతిలో 54 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి నిర్ణయించగా.. కొందరు కుల ప్రస్థావన తీసుకొచ్చి కోర్టుల్లో పిటిషన్లు వేశారని సీఎం జగన్ విమర్శించారు. నిరుపేదలకు ఇచ్చే ఆస్తులపై 44వ రాజ్యాంగ సవరణ చేస్తే.. న్యాయస్థానాలు స్టే ఇవ్వడం బాధాకరమన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ధర్మం కోసం పోరాడుతామని.. న్యాయపరమైన అడ్డంకులు తొలగి అందరికీ మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు గుర్తు చేశారు.

ఘన స్వాగతం...

సీఎం జగన్​కు ఉప ముఖ్యమంత్రులు పుష్పశ్రీవాణి, కృష్ణ దాసు, మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎంపీలు బెల్లన చంద్రశేఖర్, మాధవి, ఎంవీవీ.సత్యనారాయణ, రాజ్యసభ సభ్యులు విజయ్​సాయి రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్ హరి జవహర్ లాల్ ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు. తొలుత ఇళ్ల పట్టాలకు సంబంధించిన పైలాన్​ను ఆవిష్కరించిన సీఎం.. లే-అవుట్​లో నిర్మించిన నమూనా ఇంటిని మంత్రులు, అధికారులతో కలిసి పరిశీలించారు. లబ్ధిదారులతో ముఖాముఖి అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.

చిరునవ్వుతోనే భరిస్తున్నాం...

3,648 కి.మీ పాదయాత్రలో అన్ని కష్టాలు చూశానని సీఎం జగన్ పేర్కొన్నారు. అక్క, చెల్లెమ్మల కష్టాలు తీర్చేందుకు 25 లక్షలు ఇళ్లు నిర్మిస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లు గుర్తు చేశారు. హామీ ఇచ్చిన వాటి కంటే ఎక్కువగా.. 30 లక్షల 75 వేల గృహాలు నిర్మిస్తున్నామని తెలిపారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ.. అర్హత ఉన్న పేదవాళ్లకు 90 రోజుల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చే ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ నిరంతర ప్రక్రియ ద్వారా కాలనీలు కాకుండా ఊళ్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. కోటి 24 లక్షల మంది లబ్ధిపొందుతున్నారన్నారు. 15.60 లక్షల గృహాలు తొలిదశలో.. 12 లక్షలు రెండవ దశలో నిర్మాణం చేపడతామన్నారు. 224 గజాల్లో ఇళ్లు ఇవ్వాలని తొలుత భావించినా.. తర్వాత విస్తీర్ణాన్ని 340 ఎస్​ఎఫ్​టీకి పెంచామన్నారు. ప్రస్తుతం 68,300 ఎకరాల భూముల్లో.. లబ్ధిదారుల ఆసక్తి మేరకు మూడు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో గృహాల నిర్మాణం చేపడుతున్నామన్నారు. 2.60 లక్షలు టిడ్కో ఇళ్లు నిర్మించడమే కాక.. 3000 చ.అ. ఫ్లాట్ ఒక్క రూపాయికే అందించనున్నట్లు తెలిపారు. రూ. 4,287 కోట్లు ప్రభుత్వంపై భారం పడుతున్నా.. చిరునవ్వుతోనే భరిస్తున్నామన్నారు.

అడ్డంకులతోనే ఆలస్యం..

ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన అనుచరులు కోర్టులో స్టేలు తేవడం వల్ల.. తన సొంత నియోజకవర్గం పులివెందులలోనూ ఇళ్ల పట్టాలు పంచలేకపోయానని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో 54 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చూస్తే.. మతాల పేరిట పిటిషన్లు వేశారని విమర్శించారు. విశాఖలో లక్షా 80 వేల మందికి ఇళ్ల పంపిణీ ఏర్పాట్లు చేస్తే.. భూ సమీకరణ పేరిట అడ్డుకున్నారని ఆరోపించారు. రాజమహేంద్రవరంలో 27 వేల మంది పేదలకు స్థలాలు ఇవ్వాలని చూస్తే.. ఆవ భూములు అంటూ న్యాయస్థానం ద్వారా ఆపేశారని పేర్కొన్నారు. వారు సృష్టించిన అడ్డంకుల కారణంగా 3.74 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ ఆలస్యమవుతోందన్నారు.

హామీల్లో 95 శాతం పూర్తి...

పార్టీ, ప్రాంతం, కులం, మతం ఏదీ చూడకుండా అర్హులైన అందరికీ ప్రయోజనం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. వార్డు, గ్రామ సచివాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శిస్తున్నామన్నారు. 43 లక్షల మంది మహిళలకు అమ్మఒడి, అరకోటి మందికి పైగా అన్నదాతలకు రైతు భరోసా ద్వారా ప్రయోజనం కల్పించామని వెల్లడించారు. 87 లక్షల మందికి పైగా మహిళలకు ఆసరా పథకం అందించినట్లు పేర్కొన్నారు. విద్యాకానుక, వసతి దీవెన కింద విద్యార్థులకు తోడుగా నిలిచామన్నారు. రైతన్నల కోసం పెట్టుబడి రాయితీ అందిస్తున్నామని వెల్లడించారు. కోటి 35 లక్షల కుటుంబాలకు వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మేలు చేస్తున్నామన్నారు. వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా లక్షా 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని గుర్తు చేశారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు దాదాపు 95 శాతం పూర్తిచేశామని హర్షం వ్యక్తం చేశారు.

విజయనగరంపై వరాల జల్లులు..

స్థానిక వైకాపా నేతల విజ్ఞప్తుల మేరకు.. సీఎం జగన్ పలు హామీలు ఇచ్చారు. రూ. 150 కోట్లతో కురుపాం గిరిజన ఇంజనీరింగ్ కళాశాల పనులకు నిన్న టెండర్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. విజయనగరంలో రూ. 500 కోట్లతో నిర్మించనున్న వైద్య కళాశాలకు.. జనవరిలో టెండర్లు పిలుస్తామన్నారు. సాలూరు మండలంలో గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణం తర్వలోనే చేపడతామన్నారు. తోటపల్లి జలాశయాన్ని రూ. 470 కోట్లతో, రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్​ను రూ. 620 కోట్లతో రెండేళ్లలోనే పూర్తి చేస్తామని తెలిపారు.

మరో రోజులో ఈ ఏడాది పూర్తి కాబోతుంది. 2020 ఎలాంటి తీపి జ్ఞాపకాలు ఇచ్చిందో నెమరు వేసుకుంటే.. దేశ చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా రాష్ట్ర ప్రజలకు ఉపయోగ పడ్డాను. 18 నెలల్లో 98 శాతం హామీలు అమలు చేశామని గర్వంగా చెబుతున్నాను. - సీఎం జగన్.

విజయనగరంలో సీఎం పర్యటన

అపశ్రుతి..

సమావేశంలో అస్వస్థతకు గురై.. విజయనగరానికి చెందిన వృద్ధుడు సత్తిబాబు మృతి చెందాడు. ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి వచ్చిన 108 సిబ్బంది.. సరిగా స్పందించలేదని మృతుడి భార్య ఆవేదన వ్యక్తం చేసింది. ఏవేవో కాగితాలు రావాలంటూ.. ఆస్పత్రిలో వైద్యులు నిర్లక్ష్యం చేయడంతో తన భర్త మరణించాడని పేర్కొంది. ఇళ్ల పట్టాల పంపిణీకి దంపుతులు ఇరువురూ రావాలని చెప్పగా.. వయసు మీదపడిన తన భర్తను తీసుకువచ్చానని వాపోయింది.

ఇదీ చదవండి:

15 రోజుల్లో మరోసారి భేటీ... పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం నిర్ణయం

Last Updated : Dec 30, 2020, 9:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.