విజయనగరం జిల్లా నెల్లిమర్ల వైకాపాలో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావుపై ఎమ్మెల్యే అప్పలనాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. కార్యకర్తల భేటీలో మండిపడ్డారు.
తన నియోజకవర్గంలో లక్ష్మణరావు వివాదాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని మంత్రి బొత్స దృష్టికి తీసుకెళ్లినా చర్యలు లేవన్నారు. లక్ష్మణరావుపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.
ఇదీ చదవండి: