ETV Bharat / state

హత్య కేసు.. పోలీసుల అదుపులో నిందితులు - pachipenta murder case latest updates

విజయనగరం జిల్లా పాచిపెంట మండలం మీటింగ్ వలసలో జరిగిన హత్య కేసు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

హత్య కేసులో నిందుతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

author img

By

Published : Nov 16, 2020, 9:01 PM IST

విజయనగరం జిల్లాలో హత్య కేసు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాచిపెంట మండలం మీటింగ్ వలసకు చెందిన రాజు.. అతని సోదరుడైన సీతారాం​ను ఈ నెల 3న 150 రూపాయలు అడిగాడు. సీతారాం తన దగ్గర డబ్బులు లేవని చెప్పాడు. డబ్బులు ఉండి కూడా ఇవ్వడం లేదని రాజు... సోదరునితో గొడవపడ్డాడు.

రాజు, అతని స్నేహితుడు శ్రీనివాసరావుతో కలిసి... సీతారాంను కర్రతో కొట్టి రోడ్డు మీది నుంచి కాలువలోకి తోసేశారు. తలకు బలమైన గాయం కావటంతో సీతారాంను మెుదటగా విజయనగరం అ తర్వాత విశాఖ తీసుకెళ్లారు. చికిత్స పోందుతూ ఈ నెల 10న సీతారాం మృతిచెందాడు. నిందితులపై సెక్షన్ 302 ప్రకారం పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. నిందితులు సోమవారం పారిపోతుండగా పట్టుకుని కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

పరువు నష్టం దావా కేసుపై తితిదే కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.