Chandrababu Tour: రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రపై సీఎం జగన్ సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని శ్రీకాకుళం జిల్లా పొందూరు రోడ్‌షోలా ఆరోపించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు. అధికారం శాశ్వతం కాదని.. వైకాపా నాయకులు దాన్ని గుర్తించాలని వెల్లడించారు. మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పొందూరులో చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. వైసీపీ ఇంటికి వెళ్లడం ఖాయమని తెలిపారు. చెత్త మీద పన్ను వేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని చంద్రబాబు ఎద్దెవా చేశారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగినట్లు కేంద్రం చెబుతోందని బాబు పేర్కొన్నారు. ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు పూర్తి చేశారా? అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. పొందూరు చేనేత కార్మికులకు తాము అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఉత్తరాంధ్రలో మూడు రోజుల పర్యటన: ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు విజయవాడ నుంచి విశాఖకు విమానంలో చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గన విజయనగరం బయల్దేరారు. చంద్రబాబుకు తెదేపా నేతలు గజమాలలతో ఘనస్వాగతం పలికారు. ఇదేం కర్మ రాష్ట్రానికి పేరుతో మూడు రోజులపాటు రాజాం, బొబ్బిలి, విజయనగరం నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు.
ఈ రాత్రికి చంద్రబాబు రాజాంలో జరిగే సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని.. అక్కడే బస చేయనున్నారు. శుక్రవారం బొబ్బిలి, 24న విజయనగరంలో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇవీ చదవండి: