కొవిడ్ లాక్ డౌన్ సమయంలో, ఆ తర్వాత జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలు సేవలు అందించాయని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ బాధితులకు అన్నివిధాలా సహాయం అందిస్తూ ఆదుకుంటుందన్నారు. నెహ్రూ యువ కేంద్ర, స్పార్క్ సొసైటీల ఆధ్వర్యంలో కరోనా అనాధ మృతుల ఖననం, కొవిడ్ గృహవైద్యం పద్దతులపై స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల శిక్షణ కార్యక్రమం ఆదివారం కలెక్టర్ కార్యాలయం ఆడిటోరియంలో జరిగింది. కొవిడ్ సహాయక చర్యల్లో స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేస్తున్నట్టు యూత్ కో ఆర్డినేటర్ విక్రమ్ ఆదిత్య చెప్పారు. ఈ సందర్భంగా కరోనా అనాథ మృతుల అంత్యక్రియల బృందానికి పిపిఇ కిట్లు అందజేశారు.
శిక్షణలో పాల్గొన్న వారికి మాస్కులు, ధ్రువపత్రాలు అందజేశారు. స్పార్క్ సొసైటీ అధ్యక్షులు భవాని, పద్మనాభం, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: 'దేవాలయాలపై దాడులు బాధాకరం'