ETV Bharat / state

మాన్సాస్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు - అశోక్ గజపతిరాజు తాజా వార్తలు

case file against mansas chairman ashoke gajapathiraju

author img

By

Published : Jul 22, 2021, 9:28 PM IST

Updated : Jul 22, 2021, 10:13 PM IST

21:26 July 22

కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ అశోక్‌గజపతిరాజుపై విజయనగరం ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ట్రస్టు ఈవో వేతన ఖాతాలు నిలుపుదల చేయడం పట్ల ఈనెల 17న విద్యాసంస్థల ఉద్యోగులు మాన్సాస్‌ ఛైర్మన్‌ను కలిశారు. అనంతరం ఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వేతనాలు ఎందుకు నిలిపివేశారంటూ ఈవోను నిలదీశారు. ఈ క్రమంలో ఈవో, ఉద్యోగుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి..  కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన, ఈవోపై దాడికి ప్రేరిపించారనే ఆరోపణలతో అశోక్‌గజపతిరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఛైర్మన్‌, కరస్పాండెంట్‌ సహా 10మంది ఉద్యోగులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: గ్రామాల అభివృద్ధి బాధ్యత సర్పంచులదే: మంత్రి పెద్దిరెడ్డి

Last Updated : Jul 22, 2021, 10:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.