Cancelled Trains Today Due to Train Accident: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో ఇవాళ కూడా పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు (Cancelled Trains due to Vizianagaram Train Accident) ప్రకటించారు. విజయవాడ మీదుగా వెళ్లే 27 రైళ్లను రద్దు చేయడంతోపాటు ఇతర ప్రాంతాల మీదుగా వెళ్లే మరో 28 రైళ్లను రైల్వే అధికారులు దారి మళ్లించారు. రైళ్ల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు.
రద్దయిన రైళ్ల వివరాలివీ.. (Cancelled Trains List):
- కోర్బా - విశాఖ (18517) ఎక్స్‌ప్రెస్ రద్దు
- పారాదీప్ - విశాఖ (22809) ఎక్స్‌ప్రెస్ రద్దు
- రాయగడ – విశాఖ (08503) ప్యాసింజర్ స్పెషల్ రద్దు
- పలాస – విశాఖ (08531) ప్యాసింజర్ స్పెషల్ రద్దు
- విశాఖ – గుణుపుర్ (08522) ప్యాసింజర్ స్పెషల్ రద్దు
- గుణుపుర్ - విశాఖ (08521) ప్యాసింజర్ స్పెషల్ రద్దు
- విజయనగరం - విశాఖ (07469) మెమూ స్పెషల్ రద్దు
- విజయవాడ – విశాఖ (12718) రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రద్దు
- విశాఖ - విజయవాడ (12717) రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రద్దు
- గుంటూరు - విశాఖ (12739) సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రద్దు
- కాకినాడ – విశాఖ (17267) మెమూ ఎక్స్‌ప్రెస్ రద్దు
- విశాఖ – కాకినాడ (17268) మెమూ ఎక్స్‌ప్రెస్ రద్దు
- రాజమండ్రి - విశాఖ (07466) మెమూ స్పెషల్ రద్దు
- విశాఖ – రాజమండ్రి (07467) మెమూ స్పెషల్ రద్దు
- కోరాపుట్ - విశాఖ (08545) స్పెషల్ రైలు రద్దు
- విశాఖ - కోరాపుట్ (08546) స్పెషల్ రైలు రద్దు
- పలాస - విశాఖ (08531) స్పెషల్ రైలు రద్దు
- చెన్నై - పూరీ (22860) ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు
- రాయగడ - గుంటూరు (17244) ఎక్స్‌ప్రెస్ రద్దు
AP Train Accident Viral Video: విజయనగరం రైలు ప్రమాద దృశ్యాలు.. చెల్లాచెదురుగా పడి ఉన్న రైలు బోగీలు..
దారి మళ్లించిన రైళ్లు: (Diverted Trains Today Due to Train Accident) విజయనగరం రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లు దారి మళ్లించారు. ఆ వివరాలు..
- చెన్నై - సంత్రగచి (22808) ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు
- హైదరాబాద్-షాలిమార్ (18046) ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ మళ్లింపు
- త్రివేండ్రం - షాలిమార్ (22641) ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు
- అగర్తల – బెంగళూరు (12504) ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు
- షాలిమార్-హైదరాబాద్ (18045) ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ మళ్లింపు
- సంత్రగచి - తిరుపతి (22855) ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు
- షాలిమార్-చెన్నై (12841) కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మళ్లింపు
- చెన్నై-షాలిమార్ (12842) కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మళ్లింపు
- ధన్‌బాద్ - అలెప్పీ (13351) బొకారో ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు
- హతియా - బెంగళూరు (12835) ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు
- మంగళూరు - సంత్రగచి (22852) ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు
- బెంగళూరు-హావ్‌డా (12246) దురంతో ఎక్స్‌ప్రెస్ మళ్లింపు
- తిరుపతి - హావ్‌డా (20890) ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు
- సికింద్రాబాద్-హావ్‌డా (12704) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ మళ్లింపు
- బెంగళూరు - హావ్‌డా (12864) ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు
- బెంగళూరు - జశిద్ది (22305) ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు
- కన్యాకుమారి - హావ్‌డా (22503) ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు
- చెన్నై - హావ్‌డా (12840) మెయిల్ దారి మళ్లింపు
- వాస్కోడిగామా-షాలిమార్ వయా ఖరగ్‌పూర్ మీదుగా విజయవాడ మళ్లింపు
Vizianagaram Train Accident: పట్టాలపై బీభత్సం.. కొనసాగుతున్న సహాయ చర్యలు.. ప్రమాదం జరిగిన తీరు ఇలా..
Passengers Problems Due to Trains Cancelled: రైళ్ల రద్దుతో ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ముందస్తు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాద జరిగిన స్థలంలో యుద్ధప్రాతిపదికన ట్రాక్ పురుద్ధరణ పనులు జరుగుతున్నాయి. అనుకున్న ప్రకారం జరిగితే మధ్యాహ్నానికి ట్రాక్ పునరుద్ధరిస్తామని వాల్తేరు రైల్వే డీఆర్‌ఎం వెల్లడించారు.
ప్రమాద బాధితులకు మహిళల సహాయం : రైలు ప్రమాద బాధితులకు మహిళలు తమ వంతు సాయం అందిస్తున్నారు. బృందాలుగా ఏర్పడి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద బాధితులకు, రెస్క్యూ ఆరేషన్‌లో పాల్గొన్నవారికి తాగునీరు, పాలు, అల్పాహారం అందిస్తున్నారు.
స్టేషన్లో ఉన్నవారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు: రైళ్లు రద్దయిపోయిన తరుణంలో రైల్వే స్టేషన్లో ఇరుక్కుపోయిన వారిని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారి స్వస్ధలాలకు వెళ్లేందుకు యత్నాలు చేస్తున్నామని విశాఖ స్టేషన్ మాస్టర్ అరుణ శ్రీ వెల్లడించారు. రైళ్లు రద్దు కారణంగా స్టేషన్లో ఇరుక్కుపోయిన ప్రయాణీకుల పిల్లలకు పాలు, బిస్కెట్లు వంటివి అందిస్తున్నామని వివరించారు.