విజయనగరం జిల్లా పాచిపెంటలో విషాదం నెలకొంది. పిడుగుపడి ఓ బాలుడి మృతి చెందాడు. పాచిపెంట బీసీకాలనీ సరుగుడు తోటల్లో పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ తోటల సమీపంలో పిడుగుపడింది. ఒక్కసారి అధిక శబ్ధం రావడంతో... యాజ్జపరపు చక్రి(13) స్పృహతప్పి పడిపోయాడు. బాలుడ్ని పాచిపెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా.. అప్పటికే బాలుడు చనిపోయాడని వైద్యుడు తెలిపారు.
ఇదీ చదవండి : మహిళా ఉద్యోగి పై దాడిని ఖండించిన హోంమంత్రి సుచరిత