ETV Bharat / state

పాచిపెంట రిజర్వాయర్​లో తల్లీబిడ్డల మృతదేహం లభ్యం​ - vizianagaram district crime news

విజయనగరం జిల్లాలో అదృశ్యమైన తల్లీబిడ్డల.. మృత దేహలు లభ్యమయ్యాయి. తెల్లవారుజామున హర్షవర్ధన్​(8) పాచిపెంట పెద్ద గెడ్డ రిజర్వాయర్​లో మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం తల్లి కోసం పోలీసులు గాలించి.. శవాన్ని బయటకు తీశారు.

boy
పాచిపెంట రిజర్వాయర్​లో తల్లీబిడ్డల మృతదేహం లభ్యం​
author img

By

Published : Mar 17, 2021, 1:45 PM IST

Updated : Mar 17, 2021, 4:17 PM IST

విజయనగరం జిల్లా పాచిపెంట మండలం కొత్తవలసలో అదృశ్యమైన తల్లీబిడ్డలు మృతి చెందారు. 39 ఏళ్ల వరలక్ష్మి, ఆమె 8 సంవత్సరాల కుమారుడు హర్షవర్ధన్ ఈనెల 15న అదృశ్యం అయ్యారు. కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఆచూకీ కోసం పత్రికల్లో ప్రకటన కూడా ఇచ్చారు.

ఈ క్రమంలో.. తెల్లవారుజామున పాచిపెంట పెద్దగెడ్డ రిజర్వాయర్‌లో హర్షవర్ధన్.. శవమై తేలాడు. అనంతరం తల్లి ఆచూకీ కోసం విస్త్రృతంగా గాలింపు చేపట్టగా.. ఆమె శవం లభించింది. ఈ కేసులో మరిన్ని వివరాలను సేకరిస్తున్నట్లు ఎస్ఐ ఫక్రుద్దీన్, సాలూరు సర్కిల్ ఇన్​స్పెక్టర్​ అప్పలనాయుడు.. తెలిపారు.

ఇదీ చదవండి: పీఎస్​లో చోరీ... ప్రభుత్వ మద్యం దుకాణాల నగదు అపహరణ

Last Updated : Mar 17, 2021, 4:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.