స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. నేతలతో కలసి అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
విశాఖపట్నం జిల్లా
పురపోరులో భాగంగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పెద్ద బొడ్డేపల్లి తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి భాజపాతో పాటు జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.
విశాఖలోని ఉత్తర నియోజకవర్గంలో 48వ వార్డు భాజపా, జనసేన ఉమ్మడి అభ్యర్థి గంకల కవిత తన భర్తతో కలిసి ప్రచారం నిర్వహించారు. తన భర్త గంకల అప్పారావు చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి తనను ఓటువేసి గెలిపించాలని కోరారు.
విజయనగరం జిల్లా
విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘం 27వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నాడు. సమయం ముగిశాక ఎలా ఉపసంహరణ చేస్తారని భాజపా నాయకులు ఉమామహేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమయానికి కార్యాలయంలో ఉండడంతో అవకాశం ఇచ్చామని సహాయ ఎన్నికల అధికారి కనకమహాలక్ష్మి వివరణ ఇచ్చారు.
ఇదీ చదవండి