విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని శంబరి నుంచి మామిడిపల్లి మధ్యలోని రోడ్డు సమస్యలకు తెరపడింది. వైకాపా ఎమ్మెల్యే రాజన్న దొర చొరవతో రోడ్డు నిర్మాణానికి డీఎంఎఫ్టి కింద రూ.40 లక్షలు మంజూరు చేసింది. పంచాయతీరాజ్ ఈఈ విజయ్ కుమార్, డీఈ వెంకట్రావుల ఆధ్వర్యంలో వైకాపా మండల అధ్యక్షుడు సువ్వాడ రమణ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మండలి సలహా చైర్మన్ పెద్దింటి మాధవరావు, సువ్వాడ తవుడు, గణేష్, రాజారావులు పాల్గొన్నారు.
స్థానికంగా ఇక్కడ శంబరి యాత్ర ప్రసిద్ధి చెందినప్పటికీ అధికారులు ఈ రహదారుల నిర్మాణాన్ని పట్టించుకోలేదు. గోతులతో నిండి, వర్షం పడితే చిత్తడిగా మారి నడిచేందుకు వీలులేకుండా ఉండేది. దీంతో ఎన్నోసార్లు గ్రామస్థులు అధికారులకు మొర పెట్టుకున్నారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న ఈటీవీ, ఈనాడు బృందం రహదారుల దుస్థితిపై కథనాలు ఇచ్చింది. స్పందించిన అధికారులు రోడ్ల నిర్మాణానికి డీఎంఎఫ్టీ నిధులు మంజూరు చేసింది. త్వరగా పనులు ప్రారంభించాలని పీఆర్ ప్రాజెక్టు అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.
గిరిజన గ్రామాల్లో ఎన్నో రహదారులు నిర్మాణానికి సాలూరు నియోజకవర్గ పరిధిలో పనులు ప్రారంభమైనప్పటికీ ఈ రహదారిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఉన్న రోడ్లకు ఒడిశా గవర్నమెంట్ ఫారెస్ట్ అనుమతులు వేగంగా వస్తున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం ఫారెస్ట్ అనుమతులు వంకతో రోడ్ల నిర్మాణం జాప్యం చేస్తున్నారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇవీ చూడండి...
ఉద్రిక్తంగా 'చలో రామతీర్థం'.. భాజపా, జనసేన నేతల గృహ నిర్బంధం