రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. 2019 ఎన్నికలేఅందుకు మంచి ఉదాహరణ. రాజులకుటుంబాలకు చెందిన... సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న... ఇద్దరు తండ్రులు... వారి కుమార్తెలకు సంబంధించిందీ కథ..! విజయనగర సంస్థానానికి చెందిన అశోకగజపతి.. తన కుమార్తెకు రాజకీయ అక్షరాభ్యాసం చేయిస్తుంటే... కురుపాం సంస్థానానికి చెందిన కిషోర్ చంద్రదేవ్ కు ప్రత్యర్థిగా.. ఆయన కుమార్తెబరిలో నిలిచారు.
బరిలో పూసపాటి యువరాణి
యువరాణికి రాజకీయ ఓనమాలు నేర్పేందుకు సిద్ధమయ్యారు కేంద్ర మాజీ మంత్రి అశోకగజపతిరాజు. ఆయన విజయనగరం పార్లమెంటు పరిధిలో పోటీ చేస్తూనే..కుమార్తెఅదితిని విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సై అనిపించారు. ఇప్పటికే చాలా రోజులుగా తండ్రి వెంటే ఉంటూ..అదితి...రాజకీయ ఓనమాలు నేర్చుకుంటున్నారు. దశాబ్దాలుగా అశోక్ ప్రాతినిధ్యం వహించిన ఆ స్థానంలో.. తన కుమార్తెను గెలిపించుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. అశోక్ కుటుంబానికి తరతరాలుగా ఈ నియోజకవర్గంతో ఉన్న అనుబంధం ప్రకారం చూస్తే.. ఆమె గెలుపు పెద్ద కష్టం కాకపోవచ్చు.
సమరంలో కురుపాం యువరాణి
ఎవరికైనా పోటీ...బయటివారితో ఉంటుంది...అదే కుమార్తెతో ఉంటే...ఆ స్థానంపై అందరికి ఆసక్తే. ఇప్పుడు అరకు పార్లమెంటులో ఇదే పోరు జరగనుంది. తండ్రి కిశోర్ చంద్రదేవ్‌పై ఆయన కుమార్తె శృతి దేవి పోటీ పడనున్నారు. కాంగ్రెస్ రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉండి.. కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన కిశోర్ చంద్రదేవ్ ఈ మధ్యనే తెదేపాలోకి వచ్చారు. ఆయనకు తెదేపా అరకు పార్లమెంటు సీటు కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఆయన కుమార్తె శృతికి టికెట్ ఇచ్చింది. గతంలో ఎన్నికల సమయంలో తండ్రికి చేదోడు..వాదోడుగా ఉండి ఇప్పుడు...తండ్రిని ఢీ కొట్టనుంది శృతి . తండ్రి గెలుస్తారా? కుమార్తె గెలుస్తారా..? చూడాల్సిందే.
విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న ఈ పోటీ గురించి ప్రజలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.